
నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని, స్నేహల్ కమత్, బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన మెడికల్ థ్రిల్లర్ చిత్రం ‘ఎ’. అవంతిక ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను నటుడు జగపతి బాబు విడుదల చేశారు.
తన ట్విటర్ ద్వారా ‘ఎ’ చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదలచేసిన జగపతి బాబు చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక మోషన్ పోస్టర్‌కు సైతం ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుండటంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఇదే ఉత్సాహంలో త్వరలోనే టీజర్‌ను కూడా విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు.
Here's the #A (AD INFINITUM) Movie Motion Poster. Best wishes to the entire team.@ugandharmuni @avanthikaprodu1 @NithinPrasannaz #PreethiAsrani #MOVIEAADINFINITUM https://t.co/mjsfujGJo3
— Jaggu Bhai (@IamJagguBhai) May 20, 2020
చదవండి:
జెస్సీకి కార్తీక్ ఫోన్.. ఆ తర్వాత ఏమైంది?
రానా నిశ్చితార్థం జరిగిపోయిందా?