గోరింటాకు అంటే ఆడపిల్లలకు ఎంతో ఇష్టం. పండగొచ్చినా, ఫంక్షన్ ఉన్నా చేతికి నిండుగా మెహందీ పెట్టుకోవాల్సిందే! అది ఎర్రగా పండితే చూసి మురిసిపోవాల్సిందే! అయితే గోరింటాకును ఆడాళ్లకు మాత్రమే పరిమితం చేస్తారా? తానూ పెట్టుకుంటానంటున్నాడు సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu). ఆడపిల్లలతో కలిసి తాను కూడా చేతికి గోరింటాకు పెట్టించుకున్నాడు.
రెండు చేతులకు మెహందీ
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆడపిల్లలతో రంగుల రంగేలి అన్న క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు 'సూపర్ సర్', 'మీరు రానురానూ యంగ్ అయిపోతున్నారు', 'మీరు భలే చిలిపివారండీ', 'ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా ఒకే దగ్గరున్నట్లున్నారు' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు నిరాడంబరంగా ఉంటాడు. ఎప్పుడూ సింపుల్‌గా ఉండేందుకే ప్రాధాన్యతనిస్తాడు.
బాలనటుడిగా కెరీర్ మొదలు
సినిమాల విషయానికి వస్తే మంచి మనుషులు (Manchi Manushulu) చిత్రంతో బాలనటుడిగా ఇండస్ట్రీలో రంగప్రవేశం చేశాడు. సింహస్వప్నం సినిమాతో హీరోగా మారాడు. పిల్లలు దిద్దిన కాపురం, భలే పెళ్లాం, జైలర్‌గారి అబ్బాయి, అల్లరి ప్రేమికుడు, శుభలగ్నం, భలే బుల్లోడు, సంకల్పం, మావిచిగురు, ప్రియరాగాలు, మావిడాకులు, అంతఃపురం, బడ్జెట్ పద్మనాభం, ఖుషి ఖుషీగా.. ఇలా ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు.
అప్పట్లో హీరోగా, ఇప్పుడు విలన్‌గా!
2014 నుంచి హీరోగా కన్నా సహాయక నటుడిగా, విలన్‌గానే ఎక్కువ మెప్పించాడు. లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, పిల్లా నువ్వు లేని జీవితం, జయ జానకి నాయక, హలో, రంగస్థలం, మహర్షి, అఖండ, రాధేశ్యామ్, పుష్ప 2 (Pushpa 2 Movie) ఇలా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు.
adapilallatho ranggulla ranggelli 🎨 pic.twitter.com/F2r6sy7bqZ
— Jaggu Bhai (@IamJagguBhai) December 31, 2024
చదవండి: ఎలా గౌరవించాలో మీరు నేర్పించనక్కర్లేదు.. బాలీవుడ్‌కు నాగవంశీ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment