
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లెటెస్ట్ మూవీ రాధేశ్యామ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాధాకృష్ణ దర్శకత్వంతో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ గతేడాది అక్టోబర్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మోషన్ పోస్టర్ యూట్యూబ్‌లో 21 మిలియన్లకు పైగా వ్యూస్‌ను రాబట్టింది. దీంతో ఇండియన్ సినిమాల్లో ఓ మోషన్ పోస్టర్ అత్యధిక వ్యూస్ రాబట్టడం ఇదే తొలిసారి.
దీంతో రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ మోస్ట్ వ్యూడ్ మోషన్ పోస్టర్‌గా రికార్డు సృష్టించింది. భారత్ సినీ చరిత్రలో మోషన్ పోస్టర్ అత్యధిక వ్యూస్ రాబట్టిన తొలి సినిమాగా రాధేశ్యామ్‌కు నిలిచింది. కాగా ఈ మూవీలో ప్రభాస్ విక్రమాధిత్యగా, పూజా హెగ్డె ప్రేరణగా కనిపించనున్నారు. పిరియాడికల్ ప్రేమకథ తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment