
బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల, కీర్తన, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘15-18-24 లవ్ స్టోరీ’. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్‌లు నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ చిత్రంతో త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకోబోతోంది. ప్రేమికుల రోజు పురస్కరించుకొని ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను హీరోయిన్ మెహరీన్ విడుదల చేసింది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు. అదేవిధంగా చిత్ర యూనిట్‌కు మెహరీన్ బెస్ట్ విషెస్ తెలిపారు. ‘వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. పదిహేను, పద్దెనిమిది, ఇరవై నాలుగు వయసులలో ప్రేమ దాని పర్యావసనాల మీద అద్భుతమైన కథా, కథనాలతో దర్శకుడు కిరణ్‌కుమార్ ఈ లవ్ స్టోరీని తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చిత్ర యూనిట్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment