
విశ్వంత్, శిల్ప మంజునాథ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్. సహస్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బసిరెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ని సీనియర్ హీరో శివాజీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రంతో తెలుగు పరిశ్రమలు మరో ఫెంటాస్టిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడని బలంగా నమ్మున్ననని అన్నారు.
ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఈమధ్య ఎక్కువగా వస్తుంది అని, ఇది చాలా మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఒకప్పటిలా కాదు ఇప్పుడు అవకాశం అందుకోవడం చాలా సులభతరం అయిందని.. మంచి కంటెంట్ ఉంటే చాలు ఇండస్ట్రీలో నిలబడొచ్చని నటుడు శివాజీ పేర్కొన్నారు. ‘ ఈ చిత్రం నుంచి ఎలాంటి కంటెంట్ వచ్చిన అది కచ్చితంగా బ్లాస్ట్ అయ్యేలా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ చక్కగా ప్లాన్ చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అందరిని రంజింప చేస్తుందని ప్రామిస్ చేస్తున్నాను’అని డైరెక్టర్ బసిరెడ్డి రానా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment