ఒకే జీవితం | Okate Life First Look Motion Poster | Sakshi
Sakshi News home page

ఒకే జీవితం

Published Mon, Mar 26 2018 1:35 AM | Last Updated on Mon, Mar 26 2018 1:35 AM

Okate Life First Look Motion Poster  - Sakshi

జితన్‌ రమేష్‌, శ్రుతీ యుగల్‌

సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి తనయుడు జితన్‌ రమేష్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘ఒకటే లైఫ్‌’. ‘హ్యాండిల్‌ విత్‌ కేర్‌’ అన్నది ఉపశీర్షిక. శ్రుతీ యుగల్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సుమన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎం.వెంకట్‌ దర్శకత్వంలో లార్డ్‌ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నారాయణ్‌ రామ్‌ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ని హీరో జీవా విడుదల చేశారు.

వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘టెక్నాలజీ పేరుతో పరుగెడుతోన్న నేటి తరం మానవ సంబంధాలకు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. జితన్‌ రమేష్‌ చక్కగా నటించారు. ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తి మా చిత్రం చూసిన ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ‘‘మోషన్‌ పోస్టర్‌ చాలా ఆసక్తిగా ఉంది. సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు జీవా. ‘‘నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు నారాయణ్‌ రామ్‌. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: వై.గిరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement