Jithan Ramesh
-
ఒకటే జీవితం
ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకటే లైఫ్’. ఎం.వెంకట్ దర్శకుడు. శ్రుతియుగల్ కథానాయిక. లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. వెంకట్ మాట్లాడుతూ– ‘‘నేటితరం టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోంది. హ్యూమన్ రిలేషన్స్‌కు, ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అమ్రీష్ పాటలు, రీ–రికార్డింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాను వెంకట్ తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావుగారు మా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని నారాయణ్ రామ్ అన్నారు. -
జీవాకి జోడీగా..
‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో జీవా. ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు మలయాళ బ్యూటీ మంజిమా మోహన్. ఈ ఇద్దరూ ఇప్పుడు ఓ తమిళ సినిమా కోసం జోడీ కడుతున్నారు. ఈ చిత్రాన్ని జీవా సోదరుడు, హీరో జితన్ రమేశ్ నిర్మిస్తుండటం విశేషం. సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మాప్పిళై సింగం’ సినిమా ఫేమ్ రాజశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. శింబు హీరోగా నటించిన ‘అచ్చమ్ ఎన్బదు మడమయడా’ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మంజిమా మోహన్ ఆ తర్వాత మరో రెండు తమిళ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు జీవాకి జోడీగా నటించేందుకు ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘‘జీవా, అరుళ్ని«థి కలిసి నటించనున్న మల్టీస్టారర్ చిత్రంలో జీవాకి జోడీగా మంజిమ నటిస్తారు. స్నేహం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 13న షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అని జితన్ రమేశ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అభినందన్. -
ఉన్నది ఒకటే జీవితం
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి. చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా పరిచయం కానున్న సినిమా ‘ఒకటే లైఫ్’. ‘హ్యాండిల్ విత్ కేర్’ అనేది ఉప శీర్షిక. శృతియుగల్ కథానాయికగా నటించారు. ఎమ్.వెంకట్ దర్శకత్వంలో నారాయణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను తెలంగాణ భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు విడుదల చేసి మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. పాటలు బాగున్నాయి. అనుభవం ఉన్న దర్శకునిలా వెంకట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.‘‘హారీష్రావుగారు మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఈ టెక్నాలజీ యుగంలో హ్యూమన్ రిలేషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు వెంకట్. సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి తదితరులు నటించిన ఈ సినిమాకు అమ్రీష్ సంగీతం అందించారు. -
టెక్నాలజీ పేరుతో పరుగులు
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకటే లైఫ్’. ‘హ్యాండిల్ విత్ కేర్’ అన్నది ఉప శీర్షిక. శృతి యుగల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సుమన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఎం.వెంకట్ దర్శకత్వంలో లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. వెంకట్ మాట్లాడుతూ– ‘‘నేటి తరం యువత టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోంది. మానవ సంబంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. అమ్రీష్ అద్భుతమైన సంగీతం, రీ–రికార్డింగ్’’ అందించారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సినిమా ఇది. వెంకట్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. ఆగస్ట్ 22న సినిమా విడుదల చేస్తాం’’ అని నిర్మాత నారాయణ్ రామ్ అన్నారు. -
ఒకే జీవితం
సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఒకటే లైఫ్’. ‘హ్యాండిల్ విత్ కేర్’ అన్నది ఉపశీర్షిక. శ్రుతీ యుగల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎం.వెంకట్ దర్శకత్వంలో లార్డ్ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని హీరో జీవా విడుదల చేశారు. వెంకట్ మాట్లాడుతూ– ‘‘టెక్నాలజీ పేరుతో పరుగెడుతోన్న నేటి తరం మానవ సంబంధాలకు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. జితన్ రమేష్ చక్కగా నటించారు. ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తి మా చిత్రం చూసిన ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ‘‘మోషన్ పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది. సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు జీవా. ‘‘నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు నారాయణ్ రామ్. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: వై.గిరి. -
హ్యాండిల్ విత్ కేర్
సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకటే లైఫ్’. ‘హ్యాండిల్ విత్ కేర్’ అన్నది ఉపశీర్షిక. శృతి యుగల్ కథానాయిక. ఎం.వెంకట్ దర్శకత్వంలో లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వెంకట్ మాట్లాడుతూ –‘‘టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోన్న నేటి తరం హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని సినిమాలో చూపిస్తున్నాం. ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన చిత్రమిది. మా టీమ్‌కి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నారాయణ్ రామ్. సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి, శ్యామ్, దిశ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: వై.గిరి. -
పీతతో పూనంకౌర్ స్నేహం..!
తమిళసినిమా: సముద్ర పీతతో నటి పూనంకౌర్ స్నేహానికి రెడీ అవుతోంది. ఏమిటీ అర్థం కాలేదా? చాలా గ్యాప్ తరువాత జిత్తన్ రమేశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నండు ఎన్ నన్బన్. ఇందులో నటి పూనంకౌర్ నాయకిగా నటించనుంది. పీత(నండు)కు హీరోయన్ పూనంకౌర్‌కు మధ్య స్నేహమే నండు ఎన్ నన్భన్ చిత్ర ప్రధాన ఇతివృత్తం అంటున్నారు చిత్ర దర్శకుడు ఆండాళ్ రమేశ్. ఎస్.నాగరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతానభారతి, మనోహర్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. సెవిలోరాజా ఛాయాగ్రహణం, ఎస్ఎన్.అరుణగిరి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. అభిరావిన్ రామనాథన్, జాగ్వర్‌తంగం సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. -
చాలాకాలం తర్వాత హీరో రీఎంట్రీ
చెన్నై: నటుడు జిత్తన్ రమేశ్ చాలాకాలం తరువాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. జిత్తన్ వంటి పలు చిత్రాల్లో నటించిన ఈయన కొన్ని చిత్రాలు వరుసగా నిరాశపరచడంతో నటనకు దూరమై తన తండ్రి ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్న చిత్రాల నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. తాజాగా నండు ఎన్ నన్భన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈయనకు జంటగా నెంజిరుక్కువరై, పయనం చిత్రాల ఫేమ్ పూనంకౌర్ నాయకిగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ఆమె నటిస్తున్న తమిళ చిత్రం ఇదే. అసామి, ఇన్నారుక్కు ఇనారెండ్రు చిత్రాల ఫేమ్ ఆండాళ్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. సంతానభారతి, ఆర్ఎన్ఆర్ మనోహర్, చాందిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎన్ అరుళ్‌గిరి సంగీతాన్ని అందిస్తున్నారు. దర్శకుడు ఆండాళ్ రమేశ్ మాట్లాడుతూ.. 'ఒక యువతికి, పీతకు మధ్య స్నేహం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. తరచూ సముద్ర తీరానికి వెళ్లే హీరోయిన్‌కి అక్కడ ఒక పీత ఫ్రెండ్ అవుతుంది. కనిపించకుండా పోయిన తన ప్రియుడి విషయాన్ని పీతకు చెబుతోంది. ఆమె ప్రేమికుడిని కనుగొనడానికి ఆ పీత ఎలా సహకరించిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. పీతతో హీరోయిన్ స్నేహం ఏమిటనే సందేహం కలగవచ్చు. నాన్ఈ (తెలుగులో నాని) చిత్రంలో ఒక పెద్ద విలన్‌పై చిన్న ఈగ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇదీ అంతేనని' చెప్పారు.