పీతతో పూనంకౌర్‌ స్నేహం..! | Poonam Kaur New movie Nandu en Nanban | Sakshi

పీతతో పూనంకౌర్‌ స్నేహం..!

Jul 29 2017 10:02 AM | Updated on Sep 5 2017 5:10 PM

పీతతో పూనంకౌర్‌ స్నేహం..!

పీతతో పూనంకౌర్‌ స్నేహం..!

సముద్ర పీతతో నటి పూనంకౌర్‌ స్నేహానికి రెడీ అవుతోంది. ఏమిటీ అర్థం కాలేదా? చాలా గ్యాప్‌ తరువాత జిత్తన్ రమేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నండు ఎన్ నన్బన్.

తమిళసినిమా: సముద్ర పీతతో నటి పూనంకౌర్‌ స్నేహానికి రెడీ అవుతోంది. ఏమిటీ అర్థం కాలేదా? చాలా గ్యాప్‌ తరువాత జిత్తన్ రమేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నండు ఎన్ నన్బన్. ఇందులో నటి పూనంకౌర్‌ నాయకిగా నటించనుంది. పీత(నండు)కు హీరోయన్ పూనంకౌర్‌కు మధ్య స్నేహమే నండు ఎన్ నన్భన్ చిత్ర ప్రధాన ఇతివృత్తం అంటున్నారు చిత్ర దర్శకుడు ఆండాళ్‌ రమేశ్‌.

ఎస్‌.నాగరాజ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతానభారతి, మనోహర్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. సెవిలోరాజా ఛాయాగ్రహణం, ఎస్‌ఎన్.అరుణగిరి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.  అభిరావిన్ రామనాథన్, జాగ్వర్‌తంగం సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement