చాలాకాలం తర్వాత హీరో రీఎంట్రీ | Actor Jithan Ramesh again re entry to industry | Sakshi
Sakshi News home page

చాలాకాలం తర్వాత హీరో రీఎంట్రీ

Published Sun, Jul 23 2017 8:11 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

చాలాకాలం తర్వాత హీరో రీఎంట్రీ

చాలాకాలం తర్వాత హీరో రీఎంట్రీ

చెన్నై: నటుడు జిత్తన్‌ రమేశ్‌ చాలాకాలం తరువాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. జిత్తన్‌ వంటి పలు చిత్రాల్లో నటించిన ఈయన కొన్ని చిత్రాలు వరుసగా నిరాశపరచడంతో నటనకు దూరమై తన తండ్రి ఆర్‌.బి.చౌదరి నిర్మిస్తున్న చిత్రాల నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. తాజాగా నండు ఎన్‌ నన్భన్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈయనకు జంటగా నెంజిరుక్కువరై, పయనం చిత్రాల ఫేమ్‌ పూనంకౌర్‌ నాయకిగా నటిస్తున్నారు. చాలా గ్యాప్‌ తరువాత ఆమె నటిస్తున్న తమిళ చిత్రం ఇదే. అసామి, ఇన్నారుక్కు ఇనారెండ్రు చిత్రాల ఫేమ్‌ ఆండాళ్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

సంతానభారతి, ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్, చాందిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎన్‌ అరుళ్‌గిరి సంగీతాన్ని అందిస్తున్నారు. దర్శకుడు ఆండాళ్‌ రమేశ్‌ మాట్లాడుతూ.. 'ఒక యువతికి, పీతకు మధ్య స్నేహం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. తరచూ సముద్ర తీరానికి వెళ్లే హీరోయిన్‌కి అక్కడ ఒక పీత ఫ్రెండ్‌ అవుతుంది. కనిపించకుండా పోయిన తన ప్రియుడి విషయాన్ని పీతకు చెబుతోంది. ఆమె ప్రేమికుడిని కనుగొనడానికి ఆ పీత ఎలా సహకరించిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. పీతతో హీరోయిన్‌ స్నేహం ఏమిటనే సందేహం కలగవచ్చు. నాన్‌ఈ (తెలుగులో నాని) చిత్రంలో ఒక పెద్ద విలన్‌పై చిన్న ఈగ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇదీ అంతేనని' చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement