శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మణిశంకర్’. యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి. వెంకట కృష్ణన్ అందించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కేఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ‘మణిశంకర్’ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ముందు కత్తులతో ఇంటెన్స్ లుక్‌లో శివ కంఠమనేని ఉన్న ఈ క్రియేటివ్ మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ సందర్భంగా హీరో శివకంఠమనేని మాట్లాడుతూ.. ‘ఈ రోజు విడుదలైన మా ‘మణిశంకర్’ టైటిల్, ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సంజన గల్రాని, ప్రియా హెగ్దేలతో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు జీవీకే మేకింగ్ చాలా కొత్తగా ఉంది. ఒక కొత్త కాన్సెప్ట్ తప్పకుండా మీ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’ అన్నారు. అలాగే దర్శకుడు జీవీకే మాట్లాడుతూ.. ‘మణిశంకర్ అనేది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment