![Ss Rajamouli Protege Ashwin Gangaraju To Direct 1770 Motion Poster Released - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/18/raja.jpg.webp?itok=P4_H1Z1Z)
ఇండియన్ సినిమా వైవిధ్య కథా చిత్రాల కోసం తపిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా చారిత్రక, జానపద, పౌరాణిక, ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుందా అని అనిపిస్తుంది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి చిత్రాలు ఘన విజయాలు దీనికి కారణం కావచ్చు. అలాంటి చారిత్రక ఇతివృత్తంతో 1770 అనే పాన్ ఇండియా చిత్రానికి బీజం పడింది. దీనికి రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించబోతున్నారు.
ప్రఖ్యాత రచయిత బకించంద్ర చటర్జీ రాసిన అనందమత్ నవల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రానికి బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ, కథనాలను అందిస్తున్నారు. దీనిని నిర్మాతలు శైలేంద్ర కువర్, సుజాయ్ కుట్టి, పి.కృష్ణకుమార్, సరజ్ శర్మ కలిసి ఎస్‌ఎస్ 1 ఎంటర్‌టైన్‌మెంట్, పీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. కాగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి 150 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ధ్వనిస్తున్న వందేమాతరం గీతంతో కూడిన టీజర్‌ను బుధవారం విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ మొదలగు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. నవరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్య ప్రకటనను వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిపారు.
కాగా చిత్ర దర్శకుడు అశ్విన్, గంగరాజు తన యూనిట్ సభ్యులతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రవన ముఖ్య ప్రకటనను వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా చిత్ర దర్శకుడు అశ్విన్, గంగరాజు తన యూనిట్ సభ్యులతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment