విజయేంద్ర ప్రసాద్‌ చేతుల మీదుగా ఓ సాథియా మోషన్‌ పోస్టర్‌ | Writer Vijayendra Prasad Released O Sathiya First Look Motion Poster | Sakshi
Sakshi News home page

O Sathiya Movie: సోషల్‌ మీడియాలో ఆకట్టుకుంటున్న ఓ సాథియ ఫస్టలుక్‌ మోషన్‌ పోస్టర్‌

Published Fri, Jan 13 2023 4:24 PM | Last Updated on Fri, Jan 13 2023 4:34 PM

Writer Vijayendra Prasad Released O Sathiya First Look Motion Poster - Sakshi

ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్‌ తెలుగు మూవీ ఓ సాథియా. ఈ సినిమా నిర్మాత, డైరెక్టర్‌ మహిళలు కావటం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్‌పై చందన కట్టా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. జి జాంబీ అనే చిత్రంతో ఇప్పటికే హీరో పరిచయం అయిన ఆర్యన్‌ గౌర్‌కు ఇది రెండవ సినిమా. ఇటీవల ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను ప్రముఖ లెజెండరి రైటర్‌, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్‌ విడుదల చేశారు. 

ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌కు యూట్యూబ్‌లో మంచి స్పందన అభిస్తోంది. మోషన్‌ పోస్టర్‌ వన్‌ మిలియన్‌ వ్యూస్‌ తెచ్చుకుంది. ప్యూర్‌ లవ్‌స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకు విన్ను సంగీతం అందించారు. ఈ మోషన్‌ పోస్టర్‌కు ఆయన అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఇక సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ నుంచి రెండోపోస్టర్‌ను తాజాగా రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఇక త్వరలోనే ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement