
రతన్ కిషోర్, సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘'నేను c/o నువ్వు'’. ఆగాపే అకాడమీ పతాకంపై అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్‌లు సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. తాజాగా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ "నేను c/o నువ్వు'’ చిత్ర మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్.. ఈ సినిమాకు సంబందించి ఒక చిన్న సాంగ్‌కు డ్యాన్స్ కంపోజ్ చేసి పంపిస్తే లక్ష రూపాయలు ప్రైజ్ మనీని అందజేస్తామని తెలిపింది.
మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. 'నాకు ఈ చిత్ర దర్శకుడు సాగా పది సంవత్సరాల నుంచి తెలుసు. సినిమా రంగంపై ఎంతో ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చాడు. ఇది సాగా కు రెండో చిత్రం. ఈ సినిమా కోసం తానే దగ్గరుండి కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ తన భుజాలమీద వేసుకుని ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాడు' అన్నారు.
చిత్ర దర్శకుడు సాగారెడ్డి తుమ్మ మాట్లాడుతూ.. '1980లో నా చిన్నతనంలో నేను దగ్గరగా చూసిన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాను. ఈ చిత్రానికి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయితతో పాటు మొత్తం టెక్నీషియన్స్ అందరూ నాకు మంచి స్నేహితులు. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలను దయచేసి సపోర్ట్ చేయండి' అన్నారు.
సహ నిర్మాత జోషఫ్ మాట్లాడుతూ.. 'నాకు దర్శకుడు సాగా కథ చెప్పగానే నచ్చి ఈ ప్రాజెక్ట్ లొకి వచ్చాను. సాగా ఎంతో విజనరీ ఉన్న డైరెక్టర్. పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఓ వైపు వివాహ శుభకార్యాన్ని చూపిస్తూ, మరోవైపు సంకెళ్ళతో కాళ్ళను బంధించిన ఒక చిన్న క్రైమ్ స్టోరీ అనిపించేలా పోస్టర్ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే కథ డిఫరెంట్ గా ఉంటుందని అర్థం అవుతుంది' అన్నారు.
చదవండి: సుహాస్ హీరో అనగానే అవసరమా? అంటూ చీప్ లుక్కిచ్చారు
పెళ్లైన ఆరేళ్లకు తల్లి కాబోతున్న హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment