అవతార్.. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఎంతగానో అలరించిందీ చిత్రం. దీంతో ఈ విజువల్ వండర్‌కు సీక్వెల్‌గా రాబోతోంది అవతార్: ది వే ఆఫ్ వాటర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న ఏకంగా 160 భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాలో నేవీ అధికారి రొనాల్‌గా నటించిన కేట్ విన్స్‌లెట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
భయమెరుగని నిజాయితీ గల నాయకిగా ఆమెను కీర్తించారు. అందుకు తగ్గట్టుగానే ఆమె లుక్ కూడా అదిరిపోయింది. ప్రముఖ ఎంపైర్ మ్యాగజైన్‌పై ఆమె ఫస్ట్ లుక్ ప్రచురితమైంది. ఇకపోతే విన్స్‌లెట్.. తన పాత్ర కోసం నీళ్లలో ఉన్నప్పుడు ఎక్కువ సేపు శ్వాస నిలుపుకోవడాన్ని ప్రాక్టీస్ చేసిందట. 20th సెంచరీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో విన్స్‌లెట్‌తో పాటు సామ్ వార్తింగ్‌టన్, జియో సాల్డనా, సిగర్నీ వేవర్ సహా పలువురు నటిస్తున్న విషయం తెలిసిందే!
చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ
జూలై 1న ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు..
Comments
Please login to add a commentAdd a comment