నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమా 'కంగువ'. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ పీరియాడికల్ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. చారిత్రక నేపథ్య కథతో డైరెక్టర్ శివ తీస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో 'కంగువ' చిత్రాన్ని త్రీడీలోనూ రిలీజ్ చేయనున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?)
ఇకపోతే ఈ సినిమాలో ఉధిరన్ అనే శక్తివంతమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు. శనివారం ఈ నటుడి పుట్టినరోజు సందర్భంగా 'కంగువ' నుంచి ఆయన క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'రూత్ లెస్, పవర్ ఫుల్, అన్ ఫర్ గెటబుల్' అనే క్యాప్షన్‌తో ఉధిరన్ పాత్రని పరిచయం చేశారు. ఈ పోస్టర్‌లో బాబీ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు.
యుద్ధానికి సిద్ధమవుతున్న ఉధిరన్‌కు ఆయన వర్గమంతా తమ మద్ధతు తెలుపుతున్నట్లు ఈ పోస్టర్‌లో చూపించారు. విజువల్ వండర్‌గా ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సీపీరియెన్స్ ఇచ్చేందుకు 'కంగువ' త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతోంది. రీసెంట్‌గా 'యానిమల్' మూవీలో క్లైమాక్స్‌లో కనిపించే విలన్‌గా చేసిన బాబీ.. ఇప్పుడు 'కంగువ'లో ఉధిరన్‌గా చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి)
Happy birthday #BobbyDeol brother..
— Suriya Sivakumar (@Suriya_offl) January 27, 2024
Thank you for the warm friendship. It was awesome to see you transform in full glory as the mighty #Udhiran in our #Kanguva Guys watch out for him! @directorsiva @ThisIsDSP @vetrivisuals @StudioGreen2 pic.twitter.com/e3cPBkdMcS
Comments
Please login to add a commentAdd a comment