అర్జున్ రెడ్డి సినిమా తర్వాత టాలీవుడ్‌లో బోల్డ్ ప్రేమ కథలు ఎక్కువగా వస్తున్నాయి. హీరో పాత్రను బోల్డ్‌గా చూపిస్తూనే ఓ మంచి ప్రేమ కథను ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఆడియన్స్ కూడా అలాంటి కథలనే ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో రా అండ్ బోల్డ్ రొమాంటిక్ స్టోరీస్ ఎక్కువగా వస్తున్నాయి. యువతను టార్గెట్ చేసుకొని.. నేటి తరానికి, ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
(చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. ఆ భాషలో బాక్సాఫీస్ షేక్!)
తాజాగా మరో బోల్డ్ లవ్‌స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే ‘ప్రేమికుడు’(Premikudu). రామ్ వెలుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పండు చిరుమామిళ్ల ప్రధాన పాత్రలో నటించారు. గురుదేవ్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై రామ్ యాదవ్ గొట్టె, చెరుకూరి సాయి కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో పండు చిరుమామిళ్ల(Pandu Chirumamilla) బోల్డ్ అండ్ ఇంటెన్స్ పాత్రను పోషించినట్టుగా ఫస్ట్‌లుక్ చూస్తే అర్థమవుతుంది. "అన్‌ఫిల్టర్డ్" అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. పోస్టర్‌లో హీరో నేలపై నగ్నంగా పడుకుని ఉండటం, ఆ సిగరెట్, చేతికి సంకెళ్ళు, శరీరంపై రక్తపు మరకలు చూస్తోంటే అందరినీ మెస్మరైజ్ చేసేట్టుగా ఉన్నాయి.ఈ మూవీకి ఆదిత్య లొల్ల సినిమాటోగ్రాఫర్ కాగా, చీదెళ్ల నాగార్జున రచయితగా పని చేస్తున్నారు. ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment