Vijay Deverakonda, Samantha's VD11 Movie Name, Release Date and First Look Announced - Sakshi
Sakshi News home page

Kushi: ఖుషి టైటిల్‌తో వస్తున్న విజయ్‌, సామ్‌, ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

Published Mon, May 16 2022 10:01 AM | Last Updated on Mon, May 16 2022 10:46 AM

Vijay Devarakonda, Samantha Movie Titled As Khushi, First Look Out Now - Sakshi

VD11 First Look: రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో నటించిన పాన్‌ ఇండియా ఫిలిం లైగర్‌ రిలీజ్‌కు రెడీ అవుతుండగా ఇదే డైరెక్టర్‌తో కలిసి జనగనమణ మూవీ చేయనున్నాడు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్‌. ఇందులో సమంత అతడితో జోడీ కట్టింది. సోమవారం ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్‌డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్‌.

విజయ్‌, సమంతల మూవీకి ఖుషి టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ వదిలారు. ఇందులో విజయ్‌ డ్రెస్సుకు, సమంత చీరకు ముడివేసినట్లుగా ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్‌ 23న రిలీజ్‌ కానున్నట్లు వెల్లడించారు. ఖుషి మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు.

చదవండి: వాకింగ్‌కు వెళ్లిన.. సినీ నిర్మాత దుర్మరణం

ఒకరి విప్లవం మరొకరికి ఉగ్రవాదం.. అదిరిన 'విక్రమ్‌' ట్రైలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement