Vijay Devarakonda Samantha VD11 First Look Announcement Date Locked, Check Here Details In Telugu - Sakshi
Sakshi News home page

Vd11 : సామ్‌, విజయ్‌ల ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌

Published Sun, May 15 2022 1:54 PM | Last Updated on Sun, May 15 2022 2:37 PM

Vijay Devarakonda Samantha Vd11 First Look Announcement Date Locked - Sakshi

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ను విజయ్‌ దేవరకొండ షేర్‌ చేశారు.

ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని రేపు(సోమవారం)ఉదయం 9.30నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో 11వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి తర్వాత సామ్‌, విజయ్‌ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్‌ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement