
విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సమంత అనారోగ్యం కారణంగా ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో సమంతతో పాటు మరో హీరోయిన్‌గా కృతిశెట్టికి అవకాశం దక్కిందట.
నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ రోల్ సినిమా చివర్లో చాలా ఎమోషనల్‌గా మారుతుందని, ఈ పాత్రలో కృతిశెట్టి నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్మెంట్ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్‌తో కృతిశెట్టి చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. దీంతో బేబమ్మ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment