Thalapathy 66 Titled As Varisu, First Look Poster Released - Sakshi
Sakshi News home page

Vijay As Varisu: వారసుడుగా వస్తోన్న దళపతి విజయ్‌

Published Tue, Jun 21 2022 6:31 PM | Last Updated on Tue, Jun 21 2022 7:32 PM

Thalapathy 66 Titled As Varisu, First Look Poster Released - Sakshi

దళపతి విజయ్‌ ప్రస్తుతం తన 66వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. జూన్‌ 22న విజయ్‌ బర్త్‌డే కావడంతో ఒక రోజుముందే దళపతి 66 సినిమా టైటిల్‌ను ప్రకటించారు. విజయ్‌- వంశీల కలయికలో వస్తున్న చిత్రానికి వరిసు అన్న టైటిల్‌ను ఖరారు చేశారు.

'వరిసుగా తిరిగొస్తున్న బాస్‌' అంటూ విజయ్‌ ఫస్ట్‌ లుక్‌ సైతం వదిలారు. ఇందులో హీరో బిజినెస్‌మెన్‌గా కనిపిస్తున్నాడు. బర్త్‌డే ట్రీట్‌ ఒకరోజు ముందే ఇవ్వడంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో #HBDDearThalapathyVijay, #Thalapathy66FirstLook హ్యాష్‌ట్యాగ్స్‌ తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రాబోతోంది ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

చదవండి: ‘మేజర్‌’ నుంచి ఎమోషనల్‌ వీడియో సాంగ్‌, ఆకట్టుకుంటున్న అమ్మ పాట
 పూజాకు నిర్మాతలు షాక్‌, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement