
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జాత్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఫ్యాక్డ్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం (అక్టోబరు 19) సన్నీ డియోల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘జాత్’ టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.
Comments
Please login to add a commentAdd a comment