
గులు గులు చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. హాస్యనటుడు సంతానం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. నటి అతుల్య చంద్ర, నమితా కృష్ణమూర్తి నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మేయాదమాన్, అడై చిత్రాల దర్శకుడు రత్నకుమార్ తెరకెక్కిస్తున్నారు. సర్కిల్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎస్.రాజ్ నారాయణన్ భారీఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
దీనిని జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సినీ వర్గాల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. దీనికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు తెలిపారు.