మరో తెలుగు సినిమాలో సన్నీ లియోన్.. అలాంటి కథతో! | Sunny Leone Mandira Movie First Look And Details | Sakshi
Sakshi News home page

Sunny Leone: మరో తెలుగు సినిమాలో సన్నీ లియోన్.. అలాంటి కథతో!

Published Fri, Apr 19 2024 9:02 PM | Last Updated on Fri, Apr 19 2024 9:27 PM

Sunny Leone Mandira Movie First Look And Details - Sakshi

సన్నీ లియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. తర్వాత తర్వాత నటిగా మారిపోయింది. ప్రత్యేక గీతాలు, పలు పాత్రల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈమె.. ఇప్పుడు తెలుగులో ఓ హారర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది.

(ఇదీ చదవండి: మెగాకోడలు క్యూట్‌నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!)

సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై రాబోతోన్న మూవీ 'మందిర'. సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాత. ఆర్.యువన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. సన్నీ ఈ పోస్టర్‌లో భయపెడుతూనే కవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగిలిన వివరాలు ప్రకటించనున్నారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement