'Yendira Ee Panchayati' Movie First Look Poster Unveiled - Sakshi
Sakshi News home page

ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ 'ఏందిరా ఈ పంచాయితీ' ఫస్ట్ లుక్

Published Thu, Aug 17 2023 9:25 PM | Last Updated on Fri, Aug 18 2023 9:45 AM

Endira Ee Panchayathi Movie First Look - Sakshi

డిఫరెంట్ కంటెంట్, అంతకుమించి డిఫరెంట్‌గా టైటిల్.. ఇదే ఈ తరం ప్రేక్షకలోకం మెచ్చే సినిమా. స్టార్ హీరో హీరోయిన్స్ సంగతి పక్కనబెట్టి రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలకే ఓటేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్‌లో తీసే సినిమాలకంటే మన ఊరి వాతావరణంలో తీసే సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. లోకల్ లాంగ్వేజ్, లోకల్ అడ్డాలనే తెగ ప్రేమిస్తున్నారు. అయితే నేటితరం ప్రేక్షకుల టేస్ట్‌కి అనుగుణంగా వీటన్నింటినీ కలగలుపుతూ తీసిన సినిమానే 'ఏందిరా ఈ పంచాయితీ'. 

(ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!)

ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. గంగాధర.టీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో  హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో అందరినీ ఆకట్టుకుంది. ఊర్లోని వాతావరణాన్ని, చిన్న గొడవలు, కులవృత్తులను తెలియజేసేలా కొన్ని సంకేతాలను వదిలారు. ఇలా టైటిల్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఎట్రాక్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement