
అక్కినేని వారసుడు అఖిల్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎజెంట్’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు చాకోలెట్ బాయ్‌గా కనిపించిన అఖిల్ ఈ మూవీ కోసం జిమ్‌లో కసరత్తుల చేసి సిక్స్ బ్యాక్ బాడీతో మేకోవర్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు మేకర్స్ దీనిపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. తాజాగా ఏజెంట్ చిత్రం నుంచి మమ్ముట్టి ఫస్ట్‌లుఖ్ పోస్టర్ విడుదల చేసింది చిత్రం బృందం.
ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘క్రమశిక్షణ, అంకితభావంతో తనదైన మార్గాన్ని సుగమం చేసుకున్న మెగాస్టార్ మమ్ముట్టి ఏజెంట్ చిత్రంలో భాగమయ్యారు’ అంటూ ఆయన పోస్టర్‌ను విడుదల చేశారు. తన ప్రత్యర్థిపై దాడి చేయడానికి తుపాకీని పట్టుకున్న మమ్ముట్టి భారీ యాక్షన్ సీన్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ‘ది డెవిల్ క్రూరమైన రక్షకుడు’ అని మేకర్స్ పోస్ట్ రిలీజ్ చేస్తూ క్యాప్షన్ ఇవ్వడం పట్ల మమ్ముట్టి పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షి కథానాయికగా నటిస్తోంది. హిప్ హప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు.
A Stalwart of Indian Cinema who paved his own path with Discipline & Dedication 🔥
— AK Entertainments (@AKentsOfficial) March 7, 2022
Megastar @mammukka🤘Joins the shoot of #AGENT ⚡️
Can’t wait to witness the magic on sets ❤️@AkhilAkkineni8 @DirSurender @AnilSunkara1 @VamsiVakkantham@hiphoptamizha @AKentsOfficial @S2C_Offl pic.twitter.com/pmVv474Vnz