
'నాంది' సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు హీరో అల్లరి నరేష్ కామెడీని పక్కనపెట్టి తొలిసారి సీరియస్ రోల్ పోషించారాయన. ఈ సినిమా కమర్షియల్‌గా కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో మరో సీరియస్ పాత్రలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’అనే సినిమాను చేస్తున్నారు.
అల్లరి నరేష్ సినీ కెరీర్‌ను ప్రారంభించి 20ఏళ్లు పూర్తయిన సంర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఏఆర్ రాజమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తుంది. జీ స్టూడియోస్, హర్ష మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
#Naresh59 #ItluMaredumilliPrajaneekam #IMP @anandhiactress @raajmohan73 @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @SricharanPakala pic.twitter.com/oIPsid6p6H
— Allari Naresh (@allarinaresh) May 10, 2022
Comments
Please login to add a commentAdd a comment