'ప్రభుత్వ జూనియర్ కళాశాల' టైటిల్ లుక్ రిలీజ్ | Prabhutva Junior Kalasala Title Look Released | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వ జూనియర్ కళాశాల' టైటిల్ లుక్ రిలీజ్

Published Mon, Feb 7 2022 4:58 PM | Last Updated on Mon, Feb 7 2022 5:24 PM

Prabhutva Junior Kalasala Title Look Released - Sakshi

Prabhutva Junior Kalasala Title Look Released: యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ సినిమా  ఫస్ట్‌లుక్‌ను ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేయనున్నారు. 

ఇప్పటికే షూటింగ్‌ పూర్తైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై భువన్ రెడ్డి కొవ్వూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. శరవణ వాసుదేవన్ సంగీతం సమకూర్చారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు. ఈ చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement