యాపిల్ భారత్‌లో తన రెండవ స్టోర్ గురువారం (ఏప్రిల్ 20) ప్రారంభమవుతోంది. యాపిల్ సాకెట్ (apple saket)గా పిలుస్తున్న ఈ స్టోర్‌ను సీఈవో టిమ్ కుక్ ప్రారంభిస్తున్నారు. అధికారిక ప్రారంభానికి ఒక రోజు ముందు యాపిల్ తన ఢిల్లీ స్టోర్‌కు సంబంధించిన వివరాలను, చిత్రాలను వెబ్‌సైట్‌లో ప్రచురించింది.
యాపిల్ ఉత్పత్తులను షాపింగ్ చేయడానికి, సేవలను పొందేందుకు యాపిల్ సాకెట్ కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని, ఇక్కడి సిబ్బంది కస్టమర్లకు అన్ని విధాలుగా సహకరిస్తారని కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది. అలాగే యాపిల్ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి స్టోర్‌లో ‘టుడే’ పేరుతో ఉచిత సెషన్‌లు ఏర్పాటు చేసింది.
భారతదేశంలో తమ రెండవ స్టోర్ యాపిల్ సాకెట్‌ను ప్రారంభించడం ద్వారా ఢిల్లీలోని తమ కస్టమర్‌లకు ఉత్తమమైన సేవలు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామని యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిర్‌డ్రే ఓబ్రియన్ పేర్కొన్నారు.
వెబ్‌సైట్ ఉంచిన ఫొటోల ప్రకారం.. యాపిల్ సాకెట్ స్టోర్‌లో ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వైట్ ఓక్ టేబుల్‌లతో స్టోర్ ముందు భాగాన్ని సుందరంగా రూపొందించారు. భారత్‌లో తయారు చేసిన ఫీచర్ వాల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. మరోవైపు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఈ స్టోర్‌లో డెలివరీ పొందే సౌకర్యం ఉంది. ఇందుకోసం ప్రత్యేకమైన పికప్ స్టేషన్ ఏర్పాటు చేశారు.
ఇతర అన్ని యాపిల్ స్టోర్ల మాదిరిగానే ఢిల్లీలోని యాపిల్ సాకెట్ స్టోర్ కూడా 100 శాతం పునరుత్పాదక ఇంధన శక్తితో నడుస్తుంది. ఈ స్టోర్‌లో 70 కంటే ఎక్కువ మంది నైపుణ్యం కలిగిన రిటైల్ టీమ్ ఉంది. దేశంలోని 18 రాష్ట్రాలకు వారు 15 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. డివైజ్ సెటప్ చేయడం, Apple IDని రికవరీ చేయడం, యాపిల్ కేర్ ప్లాన్‌ను ఎంచుకోవడం, సబ్‌స్క్రిప్షన్‌లను సవరించడం వంటి అన్ని విషయాలలో కస్టమర్లకు సహాయం చేసేందుకు ఇక్కడ జీనియస్ బార్ పేరుతో ప్రత్యేక ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment