భారత్‌లో ఐఫోన్‌లకు ఉండే ఆ క్రేజే వేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాపిల్ దేశంలోని ఢిల్లీ, ముంబై రెండు స్టోర్లను ప్రారంభించింది. పలు నివేదికల ప్రకారం.. యాపిల్ స్టోర్‌లు ప్రారంభమైన నెలలోనే దాదాపు రూ.25 కోట్ల విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. .
పండగలు లేకపోయినప్పటికీ యాపిల్ భారీ ఆదాయాన్ని అర్జించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా, ముంబై యాపిల్ బీకేసీ స్టోర్ ప్రారంభోత్సవం రోజు రూ.10కోట్లకు విక్రయాలు జరిగాయి. ఆ స్టోర్ ప్రారంభించిన తొలిరోజు 6వేల మందికిపైగా సందర్శించారు.
ఈ తరుణంలో యాపిల్ ఉత్పత్తుల సేల్స్ మరింత పెరిగేలా ఐఫోన్ 15, యాపిల్ వాచ్ సిరీస్ 9, మాక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ సన్నాహలు చేస్తున్నది. ఐపాడ్, ఎయిర్‌పాడ్‌లను అసెంబ్లింగ్ ప్రారంభించాలని యోచిస్తున్నదని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment