![Varalakshmi SarathKumar First Look Release From Vara IPS Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/3/vara-ips.gif.webp?itok=flvYNAhY)
క్రాక్, నాంది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. లేడీ ప్రధానమైన పాత్రలు ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘వర ఐపీఎస్’. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్లుక్ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీ లలితాంబికా ప్రొడక్షన్ నిర్మిస్తున్నఈ సినిమా తెలుగు హక్కులను శ్రీలక్ష్మి జ్యోతి బ్యానర్ వారు దక్కించుకున్నారు. శ్రీ లక్ష్మి జ్యోతి బ్యానర్ అధినేత ఏ ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తుండగా.. నేడు(ఏప్రిల్ 3) ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు.
సినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్.. సినిమాపై అంచనాలను పెంచింది. ఒరేయ్ బామ్మర్ది వంటి విజయవంతమైన సినిమాలు విడుదల చేసిన ఈ సంస్థ నుంచి మరో ఆసక్తి పరిచే సినిమా రావడం విశేషం. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ఫుల్ ఐపీఎస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జగదీష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ లాంటి భారీ సినిమాకి సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో తలైవసల్ విజయ్, రవి కాలే, సుమిత్ర, భరత్ రెడ్డి, బ్లాక్ పాండి, రాజేష్ తదితరులు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment