"శ్రీ రంగనాయక" మూవీ పోస్టర్‌ను లాంచ్‌ చేసి తనికెళ్ల భరణి | Sri Ranga Nayaka Teaser Released By Tanikella Bharani | Sakshi
Sakshi News home page

"శ్రీ రంగనాయక" మూవీ పోస్టర్‌ను లాంచ్‌ చేసి తనికెళ్ల భరణి

Feb 20 2022 9:21 PM | Updated on Jun 9 2022 6:39 PM

Sri Ranga Nayaka Teaser Released By Tanikella Bharani - Sakshi

వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంలో రామావత్ మంగమ్మ నిర్మించిన చిత్రం "శ్రీ రంగనాయక".గోవింద రాజ్ విష్ణు ఫిలిం బ్యానర్ పై నిర్మిస్తున​ ఈ చిత్రంలో వినయ్ రాజ్ దుందిగల్,  పండ్రాల లక్ష్మి, రంగ బాషా ,నిహారిక చౌదరి, లెంకల అశోక్ రెడ్డి నటిస్తున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్‌ వేడుక హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగింది.  ఫస్ట్ లుక్ ను నటుడు తనికెళ్ళ భరణి విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి  దర్శకుడు సముద్ర ,నటుడు కెప్టెన్ చౌదరి, నటుడు, నిర్మాత కోప్పిలి శ్రీనివాస్, దర్శకుడు దొరై రాజు, జూనియర్ పవన్ కళ్యాణ్, కరాటే యస్  శ్రీనివాస్, యస్.సౌమ్య, తదితర సినీ ప్రముఖులు  ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం నటుడు తనికెళ్ల భరణి మీడియాతో మాట్లాడుతూ.. నాకు భక్తి సినిమాలు అంటే ఎంతో ఇష్టం. అలాంటిది విష్ణుమూర్తి  పైన వస్తున్న "శ్రీ రంగ నాయక" చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం దర్శక,నిర్మాత లకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement