
మంచు మోహన్‌బాబు ప్రొఫెసర్ విశ్వామిత్రగా మారారు. విశ్వంత్ హీరోగా, మోహన్‌బాబు, మంచు లక్ష్మీ, చైత్రాశుక్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ప్రతీక్ ప్రజోష్ డైరెక్టర్. మోహన్‌బాబు, మంచు లక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మోహన్‌బాబు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని ఆదివారం విడుదల చేశారు.
‘‘తన ఆలోచనలు, ఆదర్శాలతో కొండలను సైతం కదిలించగల డాషింగ్ అండ్ డైనమిక్ ప్రొఫెసర్ కమ్ సైకియాట్రిస్ట్ విశ్వామిత్ర పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నారు. తండ్రీకూతుళ్లు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే. మలయాళ నటుడు సిద్ధిఖ్ విలన్‌గా, సముద్రఖని కీలక పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: లిజో కె జోస్ పని చేస్తున్నారు.
Meet the Dynamic and effervescent Professor Viswamitra. The man who can move mountains with his profound thinking and ideologies. @themohanbabu#Agninakshathram #ManchuMohanBabu #CharacterReveal #FirstLook pic.twitter.com/Q8uPz41vdu
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) July 31, 2022