Manchu Vishnu Ginna Movie First Look Is Out Goes Viral - Sakshi
Sakshi News home page

Manchu Vishnu Ginna Movie: జిన్నా ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది!

Published Mon, Jul 11 2022 4:25 PM | Last Updated on Mon, Jul 11 2022 4:48 PM

Manchu Vishnu Ginna Movie First Look Is Out - Sakshi

విష్ణు మంచు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జిన్నా. ఈషన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని మంచు విష్ణు ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్‌ సోమవారం విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్‌లో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌, అలాగే చోటా కే నాయుడు కనిపించడం విశేషం.

ఈ ఫస్ట్ లుక్‌ వీడియోలో హీరో అని పిలిస్తే పలకని మంచు విష్ణు జిన్నా అనగానే మాత్రం చటుక్కున లేచి నిలబడి దేనికైనా రెడీ అంటుండటం విశేషం. ఇక ఈ సినిమాకు ఇంతకుముందు  విష్ణు నటించిన రెండు చిత్రాలకు స్క్రిప్ట్‌లు అందించిన కోన వెంకట్  కథ, స్క్రీన్‌ప్లే రాస్తున్నారు.

చదవండి: వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్‌ స్టార్స్‌
 ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement