
ఓ వైవిధ్యమైన కథతో ముస్తాబు అవుతున్న సినిమా ఓఎంజీ. ఓ మంచి ఘోస్ట్ అనేది ట్యాగ్‌లైన్. మార్క్ సెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.హర్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. "పైసా రే పైసా" అంటూ సాగే ఈ సాంగ్ మంచి డ్యాన్స్ బీట్ సాంగ్‌గా రూపొందించారు.
ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్సే స్వయంగా రచించి, పాడటం విశేషం. త్వరలోనే ఈ ఫుల్ సాంగ్ విడుదల కాబోతుంది.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. వెన్నెల కిశోర్, శకలక శంకర్, కమెడియన్ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment