‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి నితిన్‌ ఫస్ట్‌లుక్‌ అవుట్‌ | Nithin First Look Release From Macherla Niyojakavargam Movie | Sakshi
Sakshi News home page

Nithin: ‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి నితిన్‌ ఫస్ట్‌లుక్‌ అవుట్‌

Published Sat, Mar 26 2022 1:12 PM | Last Updated on Sat, Mar 26 2022 1:12 PM

Nithin First Look Release From Macherla Niyojakavargam Movie - Sakshi

యంగ్‌ హీరో నితిన్‌ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్‌.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి ఇందులో నితిన్‌కి జోడీగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి నితిన్ లుక్‌ను విడుదల చేసింది చిత్రం బృందం.

ఈ మేరకు శ్రీ ఎన్‌ సిద్ధార్థరెడ్డి ఐఏఎస్‌ గుంటూరు కలెక్టర్‌ ఈ రోజు ఫస్ట్‌ చార్జ్‌ తీసుకున్నారంటూ అంటూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఈ రోజు ఉదయం 10గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేశారు మేకర్స్‌. గుంటూరులో జిల్లా కలెక్టర్‌గా హీరో ఎదుర్కోబోయే సవాళ్లను ఈ మూవీలో చూపించనున్నారు. రాజ‌కీయ నేప‌థ్యంతో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement