
‘‘విజయ నిర్మల జయంతి సందర్భంగా ‘మిస్టర్ కింగ్’ పోస్టర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. హీరో శరణ్, దర్శక– నిర్మాతలకు, చిత్ర యూనిట్‌కు మంచి పేరు రావాలి’’ అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. విజయ నిర్మల అన్నయ్య మనవడు, సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకత్వం వహించారు.
]హన్విక క్రియేషన్స్ పతాకంపై బి.ఎన్.రావు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా ‘మిస్టర్ కింగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విజయ నిర్మల జయంతి సందర్భంగా(ఆదివారం) కృష్ణ విడుదల చేశారు. ‘‘మా ఫ్యామిలీ నుంచి వస్తున్న 8వ హీరో శరణ్’’ అన్నారు నరేశ్. ‘‘మా అమ్మగారు కూడా విజయ నిర్మలగారి అభిమాని’’ అన్నారు బి.ఎన్.రావు. ‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు శశిధర్ చావలి.
‘‘మా సినిమా యువతకు బాగా నచ్చుతుంది’’ అన్నారు శరణ్. నిష్కల, ఊర్వీ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సమర్పణ: బేబీ హన్విక, సంగీతం: మణిశర్మ, కెమెరా: తన్వీర్ అంజుమ్, సహ నిర్మాత: రవికిరణ్ చావలి.