
ఉక్రెయిన్ బ్యూటీ మరియ ర్యాబోషప్కకి సుమతీ శతకం బోధిస్తున్నారు హీరో శివ కార్తికేయన్. ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్, ర్యాబోషప్క జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, డి.సురేశ్‌బాబు, పుస్కూర్ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలోని ర్యాబోషప్క ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తన ప్రేయసి ర్యాబోషప్కకి ప్రిన్స్ హ్యాపీగా సుమతీ శతకం బోధిస్తున్నట్లుగా పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
#Prince Second look ❤️👍 pic.twitter.com/A5mJh2cAAU
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 10, 2022
Comments
Please login to add a commentAdd a comment