![Jaathara Movie Telugu First Look](/styles/webp/s3/article_images/2024/08/9/jaathara-movie.jpg.webp?itok=1klz4izc)
సతీష్ బాబు లీడ్ రోల్ చేస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'జాతర'. రాధా కృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీయా రాజ్ హీరోయిన్. తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసి ప్రమోషన్ మొదలుపెట్టారు. ఈ పోస్టర్ చూస్తుంటే సతీష్ బాబు రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించారు. కత్తి పట్టుకుని ఉన్నారు.
(ఇదీ చదవండి: చైతూ- శోభిత తొలిసారి అక్కడే కలుసుకున్నారా?)
ఇక అమ్మవారి ఫోటో, జాతరలో పూనకాలు వచ్చినట్టుగా గెటప్, లుక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. 'దేవుడు ఆడే జగన్నాటకంలో ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం' అని పోస్టర్ మీదున్న డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిత్తూరు జిల్లాలోని పాలేటి గంగమ్మ దేవత జాతర బ్యాక్ డ్రాప్‌తో సినిమా తీశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్.. ట్విస్టులు, క్లైమాక్స్ మాత్రం)
![](/sites/default/files/inline-images/jaathara-movie-first-look.jpg)
Comments
Please login to add a commentAdd a comment