ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్.. ట్విస్టులు, క్లైమాక్స్ మాత్రం | Golam Movie OTT Streaming Details Telugu | Sakshi
Sakshi News home page

Golam OTT: చిన్న సినిమా పెద్ద హిట్.. ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?

Published Fri, Aug 9 2024 4:06 PM | Last Updated on Fri, Aug 9 2024 5:15 PM

Golam Movie OTT Streaming Details Telugu

ఓటీటీలోకి మరో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. పెద్దగా హడావుడి లేకుండానే నెటిజన్ల కోసం అందుబాటులోకి వచ్చేసింది. మర్డరీ మిస్టరీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ మలయాళంలో చిన్న సినిమాల్లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. పలువురు దర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఈ మూవీ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్  అవుతోంది?

మలయాళ ఇండస్ట్రీ ఈ ఏడాది ఫుల్ ఫామ్‌లో ఉంది. జనవరి నుంచి మొదలుపెడితే హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతోంది. అలానే చిన్న సినిమాలతోనూ అలరిస్తోంది. అలా జూన్‌లో థియేటర్లలో రిలీజైన మూవీ 'గోళం'. హీరోహీరోయిన్లతో పాటు దర్శకుడు కొత్తగా పరిచయమైన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది.

(ఇదీ చదవండి: చైతూ- శోభిత నిశ్చితార్థం.. వీళ్లిద్దరూ తొలిసారి అక్కడే కలుసుకున్నారా?)

థ్రిల్లర్ సినిమాలు తీసే జీతూ జోసెఫ్‌తో పాటు చాలామంది 'గోళం' చిత్రం చూసి మెచ్చుకున్నారు. ఇకపోతే ఈ సినిమా అంతా దాదాపు ఒకే బిల్డింగ్‌లో తీసినా స్క్రీన్ ప్లే, ట్విస్టులు బాగా పకడ్బందీగా రాసుకున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇది నచ్చేసింది.

'గోళం' విషయానికొస్తే.. ఓ కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు చూస్తుండగానే జాన్ అనే వ్యక్తిని చంపేస్తారు. పొలిటికల్‌గా పలుకుబడి ఉన్నోడు కావడంతో సంచలనమవుతుంది. ఈ కేసుని కొత్తగా పోలీస్ అయిన సందీప్ కృష్టకు అప్పజెబుతారు. అయితే ఆఫీసులో పనిచేసే వాళ్లలో ఒకరే ఈ హత్య చేసుంటారని సందీప్ అనుమానిస్తాడు. మరి కిల్లర్‌ని పట్టుకొన్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement