
ఆర్‌ఆర్‌ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NTR30 వర్కింగ్ టైటిల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్‌డేట్స్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.
తాజాగా నేడు(సోమవారం)జాన్వీ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో జాన్వీ పక్కా పల్లెటూరు అమ్మాయిగా హాఫ్ సారీలో కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment