మహేశ్... దుమ్మురేపాడు!
సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అంశాలన్నీ శ్రీనువైట్ల తీసే సినిమాల హీరోల్లో ఉంటాయి. నవ్వించడం, కవ్వించడం, సాహసాలు చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం,
సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అంశాలన్నీ శ్రీనువైట్ల తీసే సినిమాల హీరోల్లో ఉంటాయి. నవ్వించడం, కవ్వించడం, సాహసాలు చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, ఎదుటివారిని చిత్తు చేయడం, రకరకాల మాండలికాల్లో మాట్లాడటం... ఇలా ఒకటి కాదు. సాధారణంగా కనిపిస్తూనే అసాధారణ చర్యలు చేయడం శ్రీనువైట్లహీరోల స్టైల్. ‘దూకుడు’లో మహేశ్‌ని ఆయన ఎంత ఎనర్జిటిక్‌గా చూపించారో తెలిసిందేగా! ‘భయానికి మీనింగే తెలీని బ్లడ్‌రా నాది’ అంటూ.. పోలీస్‌లోని కొత్తకోణాన్ని ఆవిష్కరించారాయన. ఇప్పుడు మళ్లీ మహేశ్‌తోనే ఆయన చేస్తున్న మరో ప్రయత్నం ‘ఆగడు’. ‘దూకుడు’ని మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని యూనిట్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవలే బళ్లారిలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి శ్రీనువైట్ల చెబుతూ -‘‘ఒక పాట, కొన్ని సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో పూర్తి చేశాం. కథ రీత్యా దుమ్ములో కొన్ని సన్నివేశాలు తీశాం. అంత కాలుష్యాన్ని కూడా పట్టించుకోకుండా మహేశ్ దుమ్మ రేపాడు. ఒక్క మహేశే కాదు... యూనిట్ సభ్యులందరూ ఈ సీన్స్ విషయంలో ఎంతో సహకరించారు. నిజంగా తెరపై ఆ సన్నివేశాలు కన్నుల పండువగా ఉంటాయి’’ అని చెప్పారు. రేపటి నుంచి హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తామని, శ్రీనువైట్ల ఎంతో ప్రతిభావంతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, తమన్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర చెప్పారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారలు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.వి.గుహన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి.