డైరెక్టర్ శ్రీనువైట్ల పేరు చెప్పగానే ఢీ, రెడీ, దూకుడు లాంటి అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. కామెడీ విషయంలో సరికొత్త ట్రెండ్ చేసిన ఈయన.. ఆ తర్వాత సరైన మూవీస్ చేయక పూర్తిగా వెనకబడిపోయారు. రవితేజతో తీసిన 'అమర్ అక్బర్ ఆంటోని' ఘోరమైన డిజాస్టర్ కావడంతో కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'విశ్వం' చిత్రంతో రాబోతున్నారు.
(ఇదీ చదవండి: సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు)
గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబరు 11న దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో కాస్త బిజీగా ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అలా ఓ దానిలో మాట్లాడుతూ.. మహేశ్ బాబు 'ఆగడు' ఫ్లాప్‌పై స్పందించారు. ఆ మూవీ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని అన్నారు.
''ఆగడు' తీసినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటా. దానికి ఓ కారణం ఉంది. 'దూకుడు' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మహేశ్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకున్నా. అప్పుడు 'ఆగడు' మూవీ చేయాలనే ఆలోచనే లేదు. భారీ యాక్షన్ స్టోరీ కూడా మహేశ్‌కి చెప్పాను. సూపర్ చేసేద్దామని అన్నారు. 14 రీల్స్ సంస్థ నిర్మాతలకు కూడా కథ నచ్చింది. కానీ వాళ్లంత బడ్జెట్ పెట్టలేమన‍్నారు. అప్పట్లో వాళ్లకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. దీంతో ఆ కథని పక్కనబెట్టి 'ఆగడు' చేశాం. అయితే అది చేయకుండా ఉండాల్సిందని ఇప్పటికీ బాధపడుతుంటా' అని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment