
Akhil And Srinu Vaitla Movie: అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. తొలి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వినాయక్ తో చేశాడు. అయితే ఆ మూవీ అశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత విక్రమ్ కుమార్‌తో ‘హలో’ చేశాడు. అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘మిస్టర్ మజ్ను’గా వచ్చినా.. ప్రేక్షకుల మన్ననలు పొందలేకపోయాడు. దీంతో డైలమాలో పడిన అఖిల్.. తదుపరి సినిమాలను ఆచుతూచి ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’అనే సినిమా చేయబోతున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలను అందించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ ఓ మూవీ చేయబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తుంది. శ్రీను వైట్ల చెప్పిన కథ మైత్రీవారికి నచ్చిందని , త్వరలోనే అఖిల్ కు కథను వినిపించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల మంచు విష్ణుతో ‘ఢీ-2’ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విడుదల అనంతరం అఖిల్ మూవీని పట్టాలెక్కించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment