సుకుమార్ డైరెక్షన్‌లో అఖిల్..? | another director in talks for akhils next | Sakshi
Sakshi News home page

సుకుమార్ డైరెక్షన్‌లో అఖిల్..?

Published Thu, Jan 28 2016 3:59 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

సుకుమార్ డైరెక్షన్‌లో అఖిల్..?

సుకుమార్ డైరెక్షన్‌లో అఖిల్..?

తొలి సినిమా డిజాస్టర్గా నిలిచినా యంగ్ హీరో అక్కినేని అఖిల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా ఆకట్టుకోలేకపోయినా, వ్యక్తిగతంగా డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో మంచి మార్కులే కొట్టేశాడు. అందుకే అఖిల్తో రెండోసినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు కూడా సై అంటున్నారు. ఇప్పటికే కొంతమంది దర్శకులు కథ రెడీ చేసే పనిలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.

తొలి సినిమా రిజల్ట్తో రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అఖిల్. ఎలాంటి కథను ఎంచుకోవాలో ఇంతవరకు ఫైనల్ చేయకపోయినా అఖిల్ సినిమా కోసం ఎదురుచూసే దర్శకులు సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. త్రివిక్రమ్, విక్రమ్ కె కుమార్, శ్రీనువైట్ల, వంశీ పైడిపల్లి లాంటి టాప్ మేకర్స్ పేర్లు ఇప్పటికే క్యూలో ఉండగా తాజాగా మరో స్టార్ డైరెక్టర్, ఈ లిస్ట్లో చేరిపోయాడు.

నాన్నకు ప్రేమతో సినిమాతో సంక్రాంతి బరిలో ఘనవిజయం సాధించిన సుకుమార్, అఖిల్ హీరోగా ఓ ప్రేమకథను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అయితే ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన సుకుమార్.. అఖిల్ సినిమాను ఎప్పుడు మొదలు పెడుతాడన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా సుకుమార్ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సినిమా అయినా పట్టాలెక్కుతుందో లేక మిగతా దర్శకుల్లాగా సుకుమార్ కూడా క్యూలో ఉండిపోతాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement