
'కచ్చితంగా బ్లాక్ బ్లస్టర్ అవుతుంది'
హైదరాబాద్: 'ఆగడు' సినిమాలో పిన్స్ మహేష్ బాబు చాలా బాగా చేశాడని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. అభిమానులు ఆశ్చర్యలను ఆశ్చర్యానికి గురిచేసేలా ఇరగదీశాడని వెల్లడించారు. 'ఆగడు' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 'దూకుడు'లో మహేష్ ను పదిశాతమే చూశారని, 'ఆగడు'లో వందశాతం చూస్తారని చెప్పారు.
ఈ సినిమాకు మహేష్ అందించిన సహకారం మరవలేనని అన్నారు. ఆయన ఎంతో కష్టపడ్డారని, ఇది ప్రతి ఫ్రేమ్ లో కనిసిస్తుందన్నారు. విడుదల కోసం వేచి చేయండి. కచ్చితంగా బ్లాక్ బ్లస్టర్ అవుతుందని శ్రీను వైట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమా పనిచేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు.