ఆగడు ట్రయలర్ విడుదల | aagadu trailer released, mahesh rocks | Sakshi
Sakshi News home page

ఆగడు ట్రయలర్ విడుదల

Published Sat, May 31 2014 10:39 AM | Last Updated on Sun, Jul 14 2019 1:42 PM

ఆగడు ట్రయలర్ విడుదల - Sakshi

ఆగడు ట్రయలర్ విడుదల

ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు 'ఆగడు' సినిమా ట్రయలర్ ఎట్టకేలకు విడుదలైంది.

ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు 'ఆగడు' సినిమా ట్రయలర్ ఎట్టకేలకు విడుదలైంది. మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రయలర్ను విడుదల చేశారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో, తనదైన శైలిలో ఉన్న యాక్షన్ సన్నివేశాలతో మహేష్ ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ట్రిమ్ చేసిన గెడ్డంతో.. మాస్ పోలీస్ అధికారిగా దుమ్ము దులిపేస్తున్నాడు. ట్రయలర్ చూస్తుంటేనే అభిమానులు ఈలలు, కేకలు పెడుతున్నారు. రివాల్వర్ నుంచి షాట్గన్ వరకు అన్ని రకాల ఆయుధాలను మహేష్ ఈ సినిమాలో వాడినట్లు కనిపిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement