
హీరో రవితేజ తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో రవితేజ కనిపించనున్నారని సమాచారం. అంతకుముందు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు విజయం సాధించడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
చాలా కాలం తర్వాత ఇలియానా ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్‌ఎస్ తమన్ సంగీతం, విజయ్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దసరా పండుగ నేపథ్యంలో అక్టోబర్ 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment