వినాయక చవితిని టార్గెట్ చేసిన 'బ్రూస్లీ'
ఇటీవల లాంగ్ గ్యాప్ తీసుకున్న రామ్చరణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్లీ సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్ని రకాల ఎమోషన్స్తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకొని సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి విషయంలో రాజమౌళి రిలీజ్ చేసినట్టుగానే పోస్టర్లు, ట్రైలర్ లతో సందడి చేస్తూ ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేస్తున్నారు.
మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సీన్స్తో రూపొందించిన ఈ ట్రైలర్ చరణ్ ఫ్యాన్స్కు మంచి కిక్ ఇచ్చింది. ఆ తరువాత పవన్ పుట్టిన రోజు సందర్భంగా కూడా మరోసారి అదే ప్లాన్ను వర్క్ అవుట్ చేశారు బ్రూస్లీ యూనిట్. అయితే చిరు పుట్టిన రోజు సందర్భంగా యాక్షన్ ట్రైలర్ తో అలరించిన చెర్రీ, పవన్ పుట్టిన రోజు నాడు ఫ్యామిలీ డ్రామాను పరిచయం చేశాడు.
ఇప్పుడు వినాయకచవితిని టార్గెట్ చేస్తున్నారు బ్రూస్లీ టీం. డైరెక్టర్ శ్రీనువైట్ల మార్క్ కామెడీ పంచ్లతో కట్ చేసిన ట్రైలర్ను వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉండటంతో మరిన్న ట్రైలర్స్ వస్తాయన్న ఆనందంలో ఉన్నారు మెగా అభిమానులు.