కాంబినేషన్ కుదిరింది | Combination was settled | Sakshi
Sakshi News home page

కాంబినేషన్ కుదిరింది

Published Wed, Apr 9 2014 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

కాంబినేషన్ కుదిరింది

కాంబినేషన్ కుదిరింది

రామ్‌చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారైంది. వీరిద్దరి కలయికలో ఓ భారీ చిత్రానికి నిర్మాత డీవీవీ దానయ్య సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ప్రముఖ తారాగణం, అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేస్తారని దానయ్య తెలిపారు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో  రామ్‌చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో నటిస్తున్నారు. మరోపక్క మహేశ్‌బాబు ‘ఆగడు' సినిమాకి శ్రీను వైట్ల పని చేస్తున్నారు. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్లు రూపొందించడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని సొంతం చేసుకున్న శ్రీను వైట్ల చరణ్ కోసం శక్తిమంతమైన కథను సిద్ధం చేశారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement