లడక్‌లో బిజీగా... | Busy in ladakh | Sakshi
Sakshi News home page

లడక్‌లో బిజీగా...

Published Fri, May 23 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

లడక్‌లో బిజీగా...

లడక్‌లో బిజీగా...


 దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్దిమంది ప్రాంతీయ భాషా నటుల్లో మహేశ్ ఒకరు. ఒక్కసారి మహేశ్‌బాబు ట్రాక్ రికార్డ్ చూస్తే అది నిజమని ఎవరైనా అంగీకరిస్తారు. సినిమా సినిమాకూ మహేశ్ ఇమేజ్ పెరుగుతూనే ఉంది. ఇటీవలి చిత్రం ‘1-నేనొక్కడినే’లో హాలీవుడ్ లుక్‌తో కనిపించి అభిమానులకు కనువిందు చేశారు మహేశ్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘ఆగడు’. కచ్చితంగా విజయం సాధించాలనే కసితో ఆయన ఈ సినిమా చేస్తున్నారు. ‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
 
 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లడక్‌లో జరుగుతోంది. మహేశ్, తమన్నాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు శ్రీనువైట్ల. అలాగే మహేశ్ తదితరులపై శక్తిమంతమైన యాక్షన్ సీన్లు కూడా తీయనున్నారు. ఈ సినిమాను దసరాకి గానీ, దీపావళికి గానీ విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. ఇది ఇలావుంటే... ఈ సినిమా తర్వాత ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ నటించనున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి ‘పరాక్రమ’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement